షావోమి SU7 2026 ఎలక్ట్రిక్ సెడాన్‌ విడుదల

Monday, March 23, 2026

96.3 kWh and 101.7 kWh battery packs automobile battery allows it to travel up to 902 kilometers Electric vehicle respectively These variants are equipped with 73 kWh Xiaomi SU7 2026 Electric Sedan Launch

t f B! P L


షావోమి 2026లో కొత్త అప్‌డేట్‌తో తన SU7 ఎలక్ట్రిక్ సెడాన్‌ను లాంచ్ చేసింది . ఈ వెర్షన్‌ లో కంపెనీ ప్రధానంగా రేంజ్ పెంపు , స్పీడ్ ఛార్జింగ్ పై దృష్టి పెట్టింది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 902 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలడు .ఈ కొత్త అప్‌డేట్‌ లో బ్యాటరీ పెర్ఫార్మన్స్ మెరుగుపరచడం ద్వారా వినియోగదారులు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలరు. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగంలో ముఖ్యంగా అత్యధికంగా వినియోగం పెరుగుతున్న భారతీయ EV మార్కెట్‌లో ల భవిష్యత్‌ వినియోగదారులకు కంపార్ట్ , సమయం ఆదా వంటి బెనిఫిట్స్ కి ఉపయోగపడనుంది . షావోమి SU7 మంచి డిజైన్‌తో పాటు అధునాతన టెక్నాలజీ తో ఎలక్ట్రిక్ వాహనాలను ఇష్టపడేవారికి ఆకర్షణీయమైన ఎంపికగా నిలువనుంది. షావోమి SU7 2026 ఎలక్ట్రిక్ సెడాన్‌ ఎలక్ట్రిక్ వాహన రంగంలో అత్యంత శక్తివంతమైన , ఆధునిక మోడల్‌గా నిలుస్తోంది. ఈ వాహనం మూడు వేరియంట్లలో లభిస్తుంది.అవి స్టాండర్డ్, ప్రో, మ్యాక్స్. వీటిలో 73 kWh, 96.3 kWh, 101.7 kWh బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. రేంజ్ పరంగా స్టాండర్డ్ 720 km, ప్రో 902 km, మ్యాక్స్ 835 km వరకు ప్రయాణం చేయగలదు. మ్యాక్స్ వేరియంట్‌ 690 hp పవర్‌తో డ్యూయల్ మోటర్ AWD సిస్టమ్‌ను కలిగి ఉంది.దీని టాప్ స్పీడ్ 265 km/h వరకు ఉంటుంది . ఈ వాహనం తక్కువ ఎనర్జీ వినియోగం ద్వారా సమర్థవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. 16.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అప్ డేట్ తో మరింత కనెక్టివిటీ ఇంటిగ్రేషన్‌ను అందించేలా రూపొందించారు. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను కూడా మార్పు చేసి రెగ్యూలర్ వినియోగంలో మరింత ఉపయోగకరంగా మార్చారు. అదనంగా దీనిలో 7.1-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో పాటు హెడ్-అప్ డిస్‌ప్లేను కూడా అందించారు. డిజైన్ పరంగా ఇది సొగసైన, ఏరోడైనమిక్ బాడీతో పాటు బలమైన డ్రాగన్ ఆర్మర్ చాసిస్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది . సీటింగ్ సామర్థ్యం 5 మందికి అనుకూలంగా ఉంటుంది .సౌకర్యవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది . టెక్నాలజీ పరంగా Xiaomi HyperEngine V6S Plus పవర్‌ట్రెయిన్, Nvidia Thor-U కంప్యూటింగ్ ప్లాట్‌ఫారమ్, LiDAR, 4D mm-wave రాడార్ వంటి అధునాతన సిస్టమ్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా 360° ప్రొటెక్షన్ అందించే సెన్సర్లు, ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్టెన్స్, డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ వాహనం వేగవంతమైన ఛార్జింగ్ సిస్టమ్‌తో తక్కువ సమయంలో ఎక్కువ ప్రయాణం చేయగలదు. టోటల్ గా షావోమి SU7 2026 ఎలక్ట్రిక్ సెడాన్‌ అధిక రేంజ్‌, వేగవంతమైన ఛార్జింగ్‌, శక్తివంతమైన పెర్ఫార్మన్స్ , సొగసైన డిజైన్‌, అధునాతన టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. ఇది భారతీయ మార్కెట్‌లో EVల భవిష్యత్‌ కి ఉపయోగపడే ముఖ్యమైన అభివృద్ధిగా ఉండబోతుంది .

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ