తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ బీఆర్ఎస్‌లో కలకలం రేగుతోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరుపై నాయకులు, కార్యకర్తల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. జమ్మికుంట శివార్లలోని ఓ వెంచర్‌లో రహస్య సమావేశం సంచలనంగా మారింది. పార్టీకి రాజీనామాలు చేయడానికి బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే భేటీ అంటూ ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాయకుల రహస్య భేటీ చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నాయకులు, మండల స్థాయి నేతలతో కౌశిక్ వ్యవహారం సరిగా లేదనే చర్చ సాగుతోంది. పార్టీ మార్పా? బీఆర్ఎస్‌లోనే ఉంటూ ఎమ్మెల్యే కౌశిక్‌పై పోరాటమా? అనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిసింది. మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్‌లు, ఇతర నాయకులంతా వందమంది దాకా రహస్య భేటీకి హాజరయినట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్‌లో కలకలం : కౌశిక్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తి
السبت، 21 مارس 2026
Rebellion Against Kaushik Reddy Reports suggest that party leaders and cadres are deeply dissatisfied with the conduct of MLA telangana Turmoil in Karimnagar BRS
ليست هناك تعليقات:
إرسال تعليق