ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా ఖండించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించడం, అనంతరం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆమె ఆదివారం ఎక్స్ వేదికగా స్పందించారు. 'కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది' అన్న మహాత్మా గాంధీ మాటలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజాస్వామ్య దేశాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకునే వారు, ఒక సార్వభౌమ దేశాధినేతను ఇలా లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం, వేలాది మంది అమాయకుల ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య అని ఆమె మండిపడ్డారు.. దీనికి వారు ఏ కారణం చెప్పినా సమర్థనీయం కాదన్నారు. అనేక దేశాలు ఇప్పుడు ఈ ఘర్షణలోకి లాగబడటం విషాదకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆమె పరోక్ష విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు సాగిలపడిన మన ప్రధాని మోడీ, కనీసం ఇప్పుడైనా యుద్ధ ప్రభావిత దేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ప్రియాంక పేర్కొన్నారు.
సార్వభౌమ దేశాధినేతను లక్ష్యంగా చేసుకుని హత్య చేయడం అత్యంత హేయమైన చర్య !
الأحد، 1 مارس 2026
national She lashed out at those who claim to be leading democratic countries Targeting and killing a sovereign head of state is the most heinous act Wayanad Congress MP Priyanka Gandhi
ليست هناك تعليقات:
إرسال تعليق