పాకిస్థాన్, కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్‌బాల్ క్రేజ్‌కు పేరుగాంచిన లియారి ప్రాంతం ఇప్పుడు ‘స్పై హంట్’కు వేదికైంది. ధురంధర్ సిరీస్ ప్రభావంతో అక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం పెరిగిపోయింది. ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ అనుమానితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులతో చేతులు కలిపి, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని ప్రశ్నిస్తూ విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ వీడియోలు ఇప్పటివా? గతంలోనివా? అనే క్లారిటీ లేకుండాపోయింది. కానీ, ఈ గాలింపు చర్యల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మాత్రం భారత గూఢచారి హమ్జా అలీ మజారి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ధురంధర్‌లో ఇండియన్ స్పైగా నటించిన రణ్‌వీర్ సింగ్ పాత్ర పేరు ‘హమ్జా అలీ మజారి’. ఇప్పుడు పాకిస్తానిలు చేస్తున్న స్టంట్ చూస్తుంటే.. హమ్జా అలీ మజారినే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది వ్యవహారం అంటూ నెట్టింట సెటైర్స్ పేలుతున్నాయి. అయినా, ధురంధర్ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజజీవితంలోనూ జరుగుతున్నాయన్న భయం అక్కడి భద్రతా సంస్థలకు ఇప్పుడు రావడం విశేషం. లియారి ప్రాంతంలోని సామాన్య పౌరులు తమ ఇరుగుపొరుగు వారిని కూడా అనుమానపు చూపులతో చూసే పరిస్థితి నెలకొంది. అయినా సినిమాలో చూసిన కల్పిత పాత్రలతో పాటు మన ఒరిజినల్ స్పై ఏజెంట్‌లను ఇప్పుడు పట్టుకుంటామంటే పాకిస్తానీ జనాలు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది.
‘స్పై హంట్’కు వేదికైన లియారి : సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
الثلاثاء، 24 مارس 2026
Karachi locals and the police have joined forces to conduct a thorough sweep of the area Lyari Becomes the Stage for a ‘Spy Hunt’ national Notably pakistan Videos Go Viral on Social Media
ليست هناك تعليقات:
إرسال تعليق