ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై ఇంటి యజమాని అత్యాచారం చేసిన సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేటకు చెందిన పూజారి రఘు ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు నివసిస్తోంది. అద్దె ఉంటున్న వారింట్లో కూతురు ఇంటర్మీడియట్ చదువుతోంది. రఘు బాలికను పలుమార్లు బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. బాలికలో మార్పులు కనిపించడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్భవతి అని తెలియడంతో తల్లిదండ్రులు కూతురును నిలదీశారు. ఆమె నిజాలు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడు రఘును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
బాలికపై ఇంటి యజమాని అత్యాచారం : పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసిన పోలీసులు
السبت، 21 مارس 2026
Andhra Pradesh crime Landlord Rapes Girl Machilipatnam Police Register Case Under POCSO Act remanded him to judicial custody
ليست هناك تعليقات:
إرسال تعليق