దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలు ఉత్పత్తి చేసే కోడిగుడ్లలో 18 శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్పత్తి జరుగుతుంది. అంటే రోజుకు దాదాపు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా, ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా గా పిలుస్తారు. విశాఖపట్నం, విజయవాడ, చిత్తూరు కేంద్రంగా విస్తరించి ఉన్న పౌల్ట్రీ పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్ కు ఇక్కడి నుండి కోడిగుడ్లను అందిస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతి జరుగుతుంది. అయితే ప్రస్తుత యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు నౌకల రవాణా నిలిచిపోయింది. దీంతో ఎగుమతి కావలసిన కోడిగుడ్లు ఇక్కడే నిలిచిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో కోడిగుడ్ల ధర బాగా పడిపోయింది. ఇక ఎగుమతి చేయాల్సిన గుడ్లను నిల్వ చేయడం కూడా వీలుకాని పరిస్థితులలో కోడిగుడ్ల ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ కోడిగుడ్ల హోల్సేల్ ధరను 4.25 పైసలు గా నిర్ణయించగా ప్రస్తుతం బయట చిల్లర వర్తకుల వద్ద ఒక్కొక్క కోడి గుడ్డు ధర 5 రూపాయలు పలుకుతుంది. కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడం పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తుంది.
యుద్ధం కారణంగా కోడిగుడ్ల ధరలు పతనం
الثلاثاء، 10 مارس 2026
18 percent of the eggs produced Andhra Pradesh Egg Bowl of India and the Egg Bowl of Asia Egg prices fall due to war national
ليست هناك تعليقات:
إرسال تعليق