ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బడ్జెట్ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతుండగా అస్వస్థతకు గురైయ్యారు. బొత్స నీరసించిపోవడాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే ఆయన ప్రసంగాన్ని ఆపి కూర్చోవాలని సూచించారు. సభలోని మార్షల్స్, అసెంబ్లీ అధికారులు వెంటనే అప్రమత్తమై బొత్సను సభ వెలుపలికి తీసుకెళ్లారు. అసెంబ్లీ ఆవరణలోని డిస్పెన్సరీలో వైద్యులు బొత్సకు అత్యవసర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బొత్సకు విశ్రాంతి చాలా అవసరమని, ఆయన రెగ్యులర్ డాక్టర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇటీవలే బొత్స సత్యనారాయణ అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది తిరిగి వచ్చారు. తాజా అస్వస్థత నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా మెరుగైన పరీక్షల కోసం ఆయనను తిరిగి హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శాసనమండలిలో ప్రసంగిస్తూ అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ
الجمعة، 6 مارس 2026
Andhra Pradesh Botsa Satyanarayana falls ill while speaking in the Legislative Council Minister Payyavula Keshav who noticed that Botsa was getting tired
ليست هناك تعليقات:
إرسال تعليق