పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత 'శివాలిక్' గ్యాస్ ట్యాంకర్ ఎట్టకేలకు అడ్డంకులు దాటుకుని గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకున్నట్లుగా అధికారులు తెలిపారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా శనివారం మీడియాతో మాట్లాడుతూ శివాలిక్, నందా దేవి నౌకలు వరుసగా మార్చి 16, మార్చి 17 తేదీల్లో భారత్‌కు చేరుకుంటాయని తెలిపారు. అన్నట్లుగానే సోమవారం సాయంత్రం గుజరాత్ ఓడ రేవుకు శివాలిక్ చేరుకుంది. దీంతో భారత్‌లో గ్యాస్‌కు ఎలాంటి కొరత ఉండదు. ఈ నౌకలు దాదాపు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీని తీసుకొస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ దౌత్యం మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ పెద్దలతో కీలక మంతనాలు జరిపారు. దీంతో భారత్ జెండాలు కలిగిన నౌకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మార్గం సుగమం చేశాయి. జలసంధిలో చిక్కుకున్న నౌకలు అన్నీ భారత్‌కు క్షేమంగా తిరిగి వస్తున్నాయి. నౌకలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అన్ని నౌకలు చేరుకుంటే మాత్రం గ్యాస్, చమురు కష్టాలు తీరినట్లే.
గుజరాత్ చేరుకున్న ఎల్‌పీజీ ట్యాంకర్ 'శివాలిక్'
الاثنين، 16 مارس 2026
are yielding positive results diplomatic efforts led by India's External Affairs Minister Jaishankar LPG Tanker 'Shivalik' Arrives in Gujarat national Officials announced
ليست هناك تعليقات:
إرسال تعليق