ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు. పుంగనూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఓ వ్యక్తి తన బైక్ మైలేజీ తగ్గిపోవడాన్ని గమనించాడు. దాన్ని సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్తే.. వాళ్లు పరిశీలించి.. ఈ బైక్ పని అయిపోయింది. మైలేజ్ తగ్గిపోతూనే ఉంటుంది. ఇక బోర్ చేయించాల్సిందే అన్నారు. లేదంటే మాటిమాటికీ ఆగిపోతూ ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్పారు. దాంతో అతను.. బోర్ చేయిస్తే.. మళ్లీ కొత్త బండిలా పనిచేస్తుంది అని భావించి.. చెయ్యమన్నాడు. వాళ్లు రెండ్రోజుల్లో బోర్ చేయించి ఇచ్చారు. దాంతో అతను ఆనందంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఐతే.. సర్వీస్ వాళ్లు చెప్పిన ఓ విషయం.. ప్రాణాలు పోయేందుకు పరోక్ష కారణం అయ్యింది. వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాక దాన్ని రాత్రంతా ఉంచాలి అని మెకానిక్ సూచించాడు. ఆ వ్యక్తి రాత్రి బండిని స్టార్టింగ్‌లో ఉంచాడు. తర్వాత కుటుంబం మొత్తం రాత్రి గడియ వేసుకొని నిద్రపోయింది. ఐతే వాళ్లు ఒక విషయం గమనించలేదు. ఆ బైక్ నుంచి రిలీజ్ అయిన పొగ మామూలు పొగ కాదు. విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్. అది ఓ క్షణం పీల్చితే.. ఏం కాదు గానీ.. ఆ ఫ్యామిలీ ఆ పొగను రాత్రంతా పీల్చినట్లైంది. బండి ఆన్‌లో ఉండటంతో.. కంటిన్యూగా దాని నుంచి పొగ.. ఇంట్లోకి వస్తూనే ఉంది. కానీ కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉన్నారు. తమకు తెలియకుండానే వారు ఆ పొగను పీల్చారు. నిద్రలోనే కన్నుమూశారని ప్రాథమికంగా తెలిసింది. తెల్లారే సరికి ఆ కుటుంబం నిద్ర లేవలేదు. చుట్టుపక్కల వాళ్లు.. బైక్ ఆన్‌లోనే ఉండటం చూసి.. ఇదేంటి అనుకుంటూ.. తలుపు తట్టగా.. ఎవరూ స్పందించలేదు. కిటికీ నుంచి చూడగా లోపల పొగ ఉంది. ఆ తర్వాత గమనిస్తే.. అందరూ చనిపోయినట్లు కనిపించారు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ప్రాథమిక ఎంక్వైరీ చెయ్యగా ఇదంతా తెలిసింది. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
నలుగురి ప్రాణం తీసిన బైక్ పొగ !
الأحد، 15 مارس 2026
Among the deceased were two children Andhra Pradesh's Annamayya district Bike Fumes Claim Four Lives crime Punganur
ليست هناك تعليقات:
إرسال تعليق