ర్మూజ్ నుంచి కరాచీకి వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దళాలు వెనక్కి పంపాయి. కరాచీకి వెళ్తున్న కంటెయినర్ నౌకను అనుమతి లేని కారణంగా వెనక్కి పంపినట్టు ఇరాన్ తెలిపింది. అలీరెజా తంగ్సిరి ప్రకారం చట్టపరమైన నిబంధనలను పాటించడంలో విఫలమైన సెలెన్‌గా గుర్తించిన ఆ నౌకను ఐఆర్‌జీసీ నౌకాదళం అడ్డగించింది. వ్యూహాత్మక జలమార్గంలోకి ప్రవేశించే ముందు అన్ని నౌకలు ఇరాన్ నేవీ అధికారులతో పూర్తిగా సమన్వయం చేసుకోవాలని తంగ్సిరి తెలిపారు. ఈ చర్య ఇరాన్ సార్వభౌమాధికార ప్రకటన అని, ప్రజా మద్దతుతోనే ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటైన హర్మూజ్‌పై ఇరాన్ తన నియంత్రణను మరింత కఠినతరం చేస్తోందన్న విషయాన్ని ఈ చర్య స్పష్టం చేస్తోంది.

Post a Comment

أحدث أقدم