హైదరాబాద్ లోని మీర్‌పేట్, బడంగ్‌పేట్ వెంకటాద్రి నివాస్‌లో ఉండే హిమబిందు పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ యువతి. గత రెండేళ్లుగా పిల్లిని ఇంట్లోవాళ్ల కంటే మిన్నగా చూసుకునేది. కాలేజ్ నుంచి వచ్చాక ఫుల్ టైమ్ పిల్లితోనే గడిపేది. అయితే ఈ మధ్య పిల్లి చనిపోయింది. అప్పట్నుంచి ఏదో కోల్పోయినట్టు ఉండేదని కుటుంబసభ్యులు తెలిపారు. పిల్లి చనిపోవడం తట్టుకోలేక పురుగుల మందు తాగి హిమబిందు ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే హిమబిందు చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. పిల్లి కోసం యువతి సూసైడ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తలో రకంగా స్పందించారు.
పెంపుడు పిల్లి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న యువతి !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق