కేరళలోని ధర్మదం నియోజకవర్గం నుంచి సీఎం పినరయి విజయన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఏప్రిల్‌ 9న కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్నది. ఈ నేపథ్యంలో అక్కడి నామినేషన్‌ల పర్వం మొదలైంది. అందులో భాగంగానే విజయన్‌ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో తలస్సెరి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అంతకుముందు బుధవారం తన నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. 80 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ప్రచారం మొదలుపెట్టిన విజయన్‌ తన రాజకీయ జీవితంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడం ఇది ఏడోసారి. ధర్మదం నుంచి బరిలో దిగడం ఇది మూడోసారి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున వీపీ అబ్దుల్‌ రషీద్‌ బరిలో నిలువగా, బీజేపీ అభ్యర్థిగా రంజిత్‌ పోటీ చేయనున్నారు.

Post a Comment

أحدث أقدم