ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం జరుగుతున్న కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అయితే ఈ జలసంధి మార్గాన్ని ఇరాన్ నిలిపివేసింది.ఒకవేళ తమ ఆదేశాలను ధిక్కరించి జలసంధి దాటేందుకు ప్రయత్నింస్తే అలాంటి నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ఇతర దేశాలను గట్టిగా హెచ్చరించింది.హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాల్లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసుకునేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ యుద్ధ సమయంలో రష్యా చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటిచింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.భారతీయ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ స్పష్టం చేశారు. గ్లోబల్ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా చూసేందుకు అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాల్లో ఇంధన కొరత ఏర్పడే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ కొరత ముప్పును నివారించేందుకు ఇప్పటికే రష్యా నుంచి బయలుదేరి సముద్రంలో నిలిచిపోయిన సుమారు 95 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి
الجمعة، 6 مارس 2026
international national US allows India to buy crude oil from Russia US Treasury Secretary Schub Besant announced this on the X platform
ليست هناك تعليقات:
إرسال تعليق