క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానాలకు తీవ్రమైన ముప్పుగా మారిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తదుపరి క్యూబా దేశం పైన యుద్ధం ప్రకటిస్తారనన్న చర్చ సాగుతోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను తామే ఎంపిక చేస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ అగ్రనేత అయాతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లో మరణించిన నేపథ్యంలో, ఆయన వారసుడి ఎంపికపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖమేనీ కుమారుడు మొజ్జబా ఖమేనీని కొత్త అధినేతగా నియమించడాన్ని తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఇరాన్ శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తి కావాలి. ఖమేనీ విధానాలనే కొనసాగించే వ్యక్తి వస్తే, మరో ఐదేళ్లలో మళ్లీ యుద్ధం చేయాల్సి వస్తుంది. ఖమేనీ కుమారుడు ఒక పనికిరాని వ్యక్తి. వెనిజులాలో డెల్సీ రోడ్రిగను మధ్యంతర అధ్యక్షురాలిగా నియమించిన తరహాలోనే, ఇక్కడ కూడా నేను ఖచ్చితంగా జోక్యం చేసుకుంటాను అని ట్రంప్ ప్రకటించారు.
క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానాలకు తీవ్రమైన ముప్పుగా మారింది !
الجمعة، 6 مارس 2026
foreign policy international The Cuban government has become a serious threat to US national security US President Donald Trump
ليست هناك تعليقات:
إرسال تعليق