ఎనిమిది మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత !

الثلاثاء، 17 مارس 2026

Lok Sabha national suspension imposed on the MPs was lifted through a voice vote Suspension of Eight Opposition MPs Revoked

t f B! P L


లోక్‌సభలో ఎనిమిది మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సభలో ఆర్టికల్ 370 కింద తీర్మానం పాస్ చేశారు. మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేశారు. తొలుత ఇవాళ కాంగ్రెస్ చీఫ్ విప్ కే సురేశ్‌.. ఎంపీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని స్పీకర్‌ను కోరారు. ఎంపీ సురేశ్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర ప్రధాన్ మద్దతు ఇచ్చారు. అనుచిత ప్రవర్తన పట్ల క్షమాపణలు చెబుతున్నట్లు సురేశ్ పేర్కొన్నారు. ట్రెజరీ బెంచ్‌లు కూడా హుందాగా వ్యవహరించాలని ధర్మేంద్ర యాదవ్ అన్నారు. సభా వ్యవహారాలను స్మూత్‌గా నడిపేందుకు లక్ష్మణ రేఖ గీయాల్సి వస్తుందని మంత్రి రిజిజు అన్నారు. సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని, విపక్షాలకు కూడా సమాన అవకాశం ఇవ్వాలన్ని సురేశ్ కోరారు. అయితే ఆ సమయంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ ప్లకార్డులను ప్రదర్శించరాదు అని, ఏఐ జనరేటెడ్ పిక్‌లను వాడవద్దు అని సభ్యులను బిర్లా కోరారు. ఆ తర్వాత రద్దు తీర్మానాన్ని పాస్ చేశారు. సస్పెన్షన్ రద్దు అయిన ఎంపీల్లో గుర్జీత సింగ్ ఔజ్లా, హిబ్బి ఈడెన్‌, సి కిరణ్ కుమార్ రెడ్డి, అమరిందర్ సింగ్ రాజా వారింగ్‌, మానికం ఠాగూర్‌, ప్రశాంత్ పడోల్‌, డీన్ కురియకోస్‌, ఎస్ వెంకటేశన్ ఉన్నారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత ఆ 8 మంది ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ