మారుతి సుజుకీ కంపెనీకి చెందిన వాగన్ ఆర్ ఫిబ్రవరి 2026 గణాంకాల ప్రకారం టాప్ లో ఉంది. వినియోగదారులు ఎక్కువగా ఎస్ యూవీ విభాగం వైపు మొగ్గు చూపినట్టు అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. జాబితాలో మారుతి సుజుకి మోడళ్లే అగ్రస్థానాల్లో నిలిచాయి. ఇందులో వాగన్ ఆర్ అత్యధికంగా అమ్ముడైన కారుగా మొదటి స్థానాన్ని దక్కించు కుంది. సరసమైన ధర, మంచి మైలేజ్ మధ్య తరగతి కుటుంబాలను ఈ కార్ వైపు ఆకర్షిం చింది. అలాగే స్విఫ్ట్, డిజైర్ అమ్మకాలలో జోరు కొనసాగిస్తూ టాప్ 5 లో చోటు సంపాదించా యి. కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బ్రెజ్జా కు మంచి డిమాండ్ కనిపించింది. కుటుంబ అవసరాలకు సరిపోయే ఎర్టిగా కూడా మంచి స్పందన పొందింది. వీటితో పాటు ఫ్రాంక్స్ టాప్ 10 జాబితాలో స్థానం సాధించింది.
0 Comments