సపోటా పండులో విషం పెట్టి రెండేళ్ల కూతురిని చంపిన తండ్రి !

الأربعاء، 25 مارس 2026

crime disputes eventually began to arise between the couple Father Kills Two-Year-Old Daughter by Feeding Her a Poisoned Sapota Fruit telangana Yadadri Bhuvanagiri district

t f B! P L


తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో వైవాహిక కలహాలతో ఒక తండ్రి తన రెండేళ్ల కుమార్తెకు విషం కలిపిన సపోటా పండు తినిపించి ప్రాణాలు తీశాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం సంస్థాన్‌నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంకు చెందిన వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గుల స్వాతితో వివాహమైంది. వీరికి రెండేళ్ల మేఘన, తొమ్మిది నెలల మయూరి సంతానం. పెళ్లి తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నా, దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త తీరుతో విసిగిపోయిన స్వాతి చిన్న కూతురు మయూరి ని తీసుకొని మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్ళింది. మేఘన మాత్రం రవి వద్ద ఉంటోంది. తన పెద్ద కూతురుని కూడా తన వద్దకు పంపించాలని స్వాతి పదేపదే రవిని అడుగుతోంది. పెద్దల ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించినా రవి నిరాకరిస్తూ వస్తుండడంతో స్వాతి మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ లో రవి పైన ఫిర్యాదు చేసింది. అక్కడ పోలీసులు నారాయణపురం పోలీసులకు సమాచారం ఇవ్వగా, స్థానిక పోలీసులు రవిని పిలిపించి మాట్లాడారు. పెద్ద మనుషుల సమక్షంలో మార్చి 23వ తేదీ పంచాయితీ జరగాల్సి ఉండగా, అంతకన్నా ముందే రవి తన కుమార్తెను కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో సపోటా పండులో ఎలుకల మందు కలిపి మేఘనకు పెట్టాడు. పండు తిన్న కొద్దిసేపటికే మేఘనకు వాంతులు కాగా, అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న రవి నిద్ర మాత్రలు ఎలుకల మందు తీసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వారిద్దరిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆపై అక్కడ నుంచి హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మేఘన సోమవారం మృతి చెందగా స్వాతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తులో భాగంగా రవి నుండి వాంగ్మూలాన్ని తీసుకున్నారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ