తెలంగాణ ప్రభుత్వ విప్‌గా నూతనంగా నియామకమైన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించినందుకు స్పీకర్ కి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి విజయరమణ రావు స్పీకర్‌ను కలిశారు. ప్రభుత్వ విప్‌గా తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు పార్టీ పెద్దలకు రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధితో పాటు, ప్రభుత్వ విప్‌గా అసెంబ్లీ వ్యవహారాల్లో తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని విజయరమణ రావు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వ విప్‌గా విజయరమణ రావు
الاثنين، 23 مارس 2026
Peddapalli MLA special thanks and gratitude to the Speaker telangana Vijayaraman Rao Appointed as Telangana Government Whip
ليست هناك تعليقات:
إرسال تعليق