హాంకాంగ్ నుంచి లండన్ వెళ్తున్న బ్రిటీష్ ఎయర్ వేస్ విమానంలో ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. ఫ్లైట్ ను వెనక్కి మళ్లించకుండానే 13 గంటల పాటు ప్రయాణికులతో పాటు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు. బ్రిటీష్ ఎయర్ వేస్ విమానం 331 మంది ప్రయాణికులతో హాంకాంగ్ నుంచి లండన్ కు బయలేదరింది. గంట సమయం తర్వాత అందులో ఉన్న ఓ 60 ఏళ్ల ప్రయాణికురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో అందులోనే ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని బాత్రుంలో ఉంచాలని విమాన సిబ్బంది అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మృతదేహాన్ని ఫ్లైట్ వెనుక భాగంలోని గ్యాలీకి తగిలించారు. గ్యాలీ ఫ్లోర్ వేడిగా ఉండటం వల్ల కొన్ని గంటల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన వచ్చిందని ప్రయాణికులు చెప్పారు. విమానం లండన్ లో ల్యాండ్ అయిన తర్వాత దర్యాప్తు కోసం మరో 45 నిమిషాల పాటు తమ సీట్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారని చెప్పారు. ఇంటర్నేషనల్ విమాన రవాణా సంఘం గైడ్లైన్స్ ప్రకారం విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు చనిపోతే దాన్ని ఎమర్జెన్సీ వైద్య పరిస్థితిగా పరిగణించరని ఎయిర్ లైన్స్ తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో మృతదేహాన్ని బాడీ బ్యాగ్ లో ఉంచి, విమానంలో ఖాళీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్తారని చెప్పింది. ఒకవేళ విమానం పూర్తిగా నిండిపోతే మృతదేహాన్ని సీటులోనే ఉంచుతారని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ఘటనలో తమ సిబ్బంది రూల్స్ ను పాటించారని పేర్కొంది.
హాంకాంగ్ నుంచి లండన్ వెళ్తున్న విమానం గాలిలో ఉండగా ప్రయాణికురాలు మృతి
الأحد، 22 مارس 2026
British Airways flight carrying the deceased's body alongside the other passengers flight continued its journey for 13 hours Journey from Hong Kong to London Passenger Dies Mid-Flight
ليست هناك تعليقات:
إرسال تعليق