పాకిస్థాన్ కు రుణం ఇవ్వడానికి నిరాకరించిన ఐఎంఎఫ్ !


పాకిస్థాన్ కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) రుణం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా పాకిస్థాన్, ఐఎంఎఫ్ మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దాంతో 1 బిలియన్ డాలర్లను గతంలో ఇచ్చేందుకు అంగీకరించిన ఐఎంఎఫ్ ఇప్పుడు దేశంలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ రుణాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. పాకిస్థాన్ ప్రభుత్వానికి ప్రస్తుతం దేశ ప్రజల నుంచి వస్తున్న టాక్స్ కలెక్షన్స్ అలాగే పాకిస్థాన్ కరెంట్ బడ్జెట్ నిల్వలపై అనుమానం వ్యక్తం చేసిన ఈ అంతర్జాతీయ సంస్థ ఆ దేశానికి నిధులు ఇచ్చేందుకు మొండి చేయి చూపింది. పాకిస్థాన్ రెవెన్యూ టార్గెట్స్ ను అందుకోవడంలో విఫలం అయిందని అందువల్ల ఆ దేశానికి రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ నిరాకరించిందని కరాచీకు చెందిన ఓ బిజినెస్ పత్రిక వెల్లడించింది.

Post a Comment

0 Comments