Ad Code

ఇద్దరు యువకుల ప్రాణం తీసిన రీల్స్‌ పిచ్చి !


గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో అతి వేగంగా డ్రైవ్‌ చేస్తూ రీల్స్‌ షూట్‌ చేస్తూ వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అ వధ్ తివారీ, మరొక స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఇద్దరు హుండాయ్‌ వెర్నా కారును అత్యంత వేగంగా డ్రైవ్‌ చేస్తూ రీల్స్‌ షూట్‌ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న అవధ్ తివారీ ప్రమాదానికి కొద్దిసేపటి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా కారును నడుపుతున్న వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన ఎడమ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని రీల్ రికార్డ్ చేస్తూ, మరో చేతితో స్టీరింగ్ పట్టుకున్నట్లు వీడియోలో ఉంది. కారు సుమారు 120 కిమీ వేగంతో వెళ్తుండగా, పక్క సీటులో కూర్చున్న వ్యక్తి కూడా వీడియో తీశాడు. అనంతరం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తివారీ అక్కడికక్కడే మృతి చెందగా, అతని 20 ఏళ్ల స్నేహితుడు దేవరాజ్ గోసాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ కారులో ఉన్న మరో యువకుడు అక్షయ్ ప్రవీణ్‌భాయ్ వాఘెలా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తివారీకి కార్లలో ఫీట్లు చేస్తూ వీడియోలుఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం హాబీగా మారిపోయింది. ఇప్పుడు ఆ హాబీనే అతని ప్రాణం తీసింది. 

Post a Comment

0 Comments

Close Menu