తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మార్చి 9న, ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో వీరిద్దరి ఎన్నికను అధికారులు అధికారికంగా ప్రకటించారు. అంతకుముందు దాఖలైన మరో అభ్యర్థి నామినేషన్ పత్రంలో తగినంత మంది ప్రతిపాదకుల మద్దతు లేకపోవడంతో దానిని తిరస్కరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కాంగ్రెస్ అధిష్ఠానం మరోసారి తెలంగాణ నుంచి నామినేట్ చేసింది. గతంలో బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సింఘ్వీ ఏడాదిన్నర కాలం పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు పూర్తి కాలానికి ఆయన మళ్లీ ఎన్నికయ్యారు. ఇక వేం నరేందర్ రెడ్డి విషయానికొస్తే.. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తమిత్రుడు. గతంలో టీడీపీలో ఉన్నప్పటి నుండి రేవంత్ రెడ్డితో కలిసి నడుస్తున్న నరేందర్ రెడ్డి, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవం
الثلاثاء، 10 مارس 2026
Abhishek Manu Singhvi senior Supreme Court lawyer Vem Narender Reddy unanimously elected to Rajya Sabha from Telangana
ليست هناك تعليقات:
إرسال تعليق