ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీ జానీ అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును తీవ్రంగా ఎండగడుతూ అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అశాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని లారిజానీ విమర్శించారు. ఒకప్పుడు 'అమెరికా ఫస్ట్' అని నినదించిన ట్రంప్, ఇప్పుడు దాన్ని 'ఇజ్రాయెల్ ఫస్ట్'గా మార్చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు రాజకీయ లబ్ధి కోసం అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ ఫణంగా పెడుతున్నారని ఆరోపించారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నుండి ఇరాన్ తనను తాను రక్షించుకుంటోందని లారిజానీ తెలిపారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వెనకాడబోమని, చర్చల కంటే ప్రతిఘటనకే మొగ్గు చూపుతామని ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ మద్దతు ఉన్న 'ఇస్లామిక్ రెసిస్టెన్స్' సంస్థ ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, రాకెట్లతో విరుచుకుపడింది.
ఆత్మరక్షణే మా ప్రాధాన్యత - అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశం లేదు : ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీ జానీ
الاثنين، 2 مارس 2026
international Iran's Security Chief Ali Larijani no intention to hold any talks with America Self-defense is our priority sharply criticizing America's behavior on international forums
ليست هناك تعليقات:
إرسال تعليق