గత 13 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణాకు 'కారుణ్య మరణం'.. సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. గౌరవప్రదంగా మరణించే హక్కు అంశంపై 2018 లో ఇచ్చిన తీర్పును అనుసరిస్తూ, ఒక వ్యక్తికి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. హరీశ్ రాణా తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు, ఎయిమ్స్ (AIIMS) వైద్య బృందం సమర్పించిన నివేదికను పరిశీలించింది. 'హరీశ్ ఇక కోలుకునే అవకాశం లేదని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది చాలా బాధాకరమైన నివేదిక. ఆ యువకుడిని ఇలాంటి అంతం లేని నరకయాతనలో ఇంకా ఉంచలేం. ఇది కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ, తుది నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హరీశ్‌ను వెంటనే ఎయిమ్స్ పాలియేటివ్ కేర్ యూనిట్‌లో చేర్చాలని తెలిపింది. వైద్య నిపుణుల సమక్షంలో, అత్యంత గౌరవప్రదంగా అతడికి అందిస్తున్న వైద్య చికిత్సను (కృత్రిమ ఆహారం) క్రమంగా ఉపసంహరించుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియ అంతా వైద్య, నైతిక నిబంధనలకు అనుగుణంగా జరగాలని ధర్మాసనం తెలిపింది. కృత్రిమంగా ఆహారం అందించడం కూడా వైద్య చికిత్స కిందకే వస్తుందని, రోగి కోలుకునే అవకాశం లేనప్పుడు దానిని నిలిపివేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. తమ కుమారుడి బాధను చూడలేక అతడికి విముక్తి ప్రసాదించాలని కోరిన తల్లిదండ్రుల ఆవేదనను కోర్టు ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకుంది. హరీశ్ రాణా ఉదంతం అత్యంత విషాదకరమైనది. 2013లో చండీగఢ్‌లో చదువుకుంటున్న సమయంలో హరీశ్ ఒక భవనం నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయమై 100 శాతం అంగవైకల్యంతో కోమాలోకి వెళ్ళాడు. గత 13 ఏళ్లుగా అతడు కేవలం పైపుల ద్వారా అందించే కృత్రిమ ఆహారం పైనే శ్వాస తీసుకుంటున్నాడు.
హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు
الأربعاء، 11 مارس 2026
first time that a person has been allowed to die with dignity Justices JB Pardiwala and KV Vishwanathan gave the verdict national Supreme Court allows euthanasia for Harish Rana
ليست هناك تعليقات:
إرسال تعليق