యుద్ధ పరిస్థితులతో వంట నూనెల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. లీటరుకు పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు వంట నూనెల ధరలు పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సరఫరా లో అంతరాయాలు దిగిన సరుకు రవాణా ధరలు ఇరాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకున్న భయాందోళనల కారణంగా వంట నూనె సరఫరా పైన పడిన ప్రభావం ధరల పెరుగుదలకు కారణమైంది. హార్ముజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ తీవ్రంగా ప్రభావితమైంది. దీనివల్ల పొద్దుతిరుగుడు, సోయా నూనెల సరఫరాలో జాప్యం జరుగుతుంది. యుద్ధం కొనసాగితే మరింతగా ధరలు పెరగవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుదలకు ముఖ్యంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడమే కారణమని భావిస్తున్నారు. మన దేశానికి కావాల్సిన వంట నూనె ముడిసరుకు జలమార్గం ద్వారానే చేరుతుండగా, యుద్ధానికి ముందే ధరలు రూ.120 నుండి రూ.140-150కి చేరాయి. ప్రస్తుతం లీటరు ప్యాకెట్ వంట నూనె ధర 170 రూపాయలు కాగా, అదనంగా మరో 10 రూపాయలు కలిపి 180 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వంట నూనె ధరలు పెరిగి, కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.ఇక ఈ పరిస్థితులు ఇలానే ఉంటే సామాన్యులు కనీసం తిండి కూడా తినలేని పరిస్థితి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పెరిగిన వంట నూనెల ధరలు
الخميس، 12 مارس 2026
business increased by Rs 10 to Rs 20 per liter Increased cooking oil prices increasing significantly due to the war situation national
ليست هناك تعليقات:
إرسال تعليق