ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం కారణంగా ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజర్ల అవసరాలను గుర్తించి మిగతా పనులను స్వయంగా పూర్తి చేస్తాయంటూ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ జోస్యం చెప్పారు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 2007లో ఐఫోన్ రాకతో కీప్యాడ్ ఫోన్లు ఎలాగైతే కనుమరుగయ్యాయో, అలాగే ఏఐ ఏజెంట్ల రాకతో యాప్స్ కూడా ఓ హిస్టరీగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు త్వరలో ఒక వింత అనుభవం ఎదురుకాబోతోంది. ఫోన్ అనగానే మనకు గుర్తొచ్చే విభిన్న రంగుల్లో కనిపించే యాప్స్ ఇకపై ఉండకపోవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం ఒక చిన్న పని చేయాలన్నా రకరకాల యాప్స్ మీద ఆధారపడుతున్నాం. ఉదాహరణకు, ఒక ఫ్రెండ్‌తో కాఫీ మీటింగ్ ప్లాన్ చేయాలంటే మెసేజింగ్ యాప్, మ్యాప్స్, క్యాబ్ బుకింగ్ యాప్, క్యాలెండర్.. ఇలా కనీసం నాలుగైదు యాప్స్ వాడాల్సి వస్తోంది. కానీ భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు యూజర్ ఆలోచనను ముందే గ్రహిస్తాయని కార్ల్ పీ వివరించారు. మనం చెప్పక ముందే సిస్టమ్ మన అవసరాలను గుర్తించి, అన్ని పనులను వాటంతట అవే పూర్తి చేసే స్థాయికి టెక్నాలజీ చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం యాప్స్ ద్వారానే వ్యాపారాన్ని నడిపే కంపెనీలకు, స్టార్టప్‌లకు ఇది ఓ కీలక హెచ్చరిక అని చెప్పవచ్చు. ఒకవేళ ఓ బిజినెస్ మోడల్ మొత్తం కేవలం ఒక యాప్ మీదనే ఆధారపడి ఉంటే, ఏఐ విప్లవం ఆ బిజినిస్ ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉందని కార్ల్ పీ హెచ్చరించారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అనేది యూజర్ ఇంటరాక్షన్ కంటే కూడా ఇంటెలిజెన్స్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మార్పును ముందే పసిగట్టిన 'నథింగ్' సంస్థ తన డివైజ్‌లలో ఇప్పటికే ఏఐ ఫీచర్లను జోడిస్తోంది. ఇటీవల 'వైబ్ కోడింగ్' వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు కేవలం ప్రాంప్ట్స్ ఇవ్వడం ద్వారా తమకు కావలసిన విడ్జెట్స్ లేదా మినీ యాప్స్‌ను స్వయంగా తయారు చేసుకోవచ్చు. అంటే, కంపెనీలు ఇచ్చే యాప్స్ కాకుండా, యూజర్లు తమకు నచ్చినట్లుగా సాఫ్ట్‌వేర్‌ను మల్చుకునే వీలు కలుగుతుంది. సాంకేతికత ఎప్పుడూ ఒకేలా ఉండదు. 20 ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్ అనుభవం ఒకేలా ఉందని, ఇప్పుడు దాన్ని మార్చే సమయం వచ్చిందని కార్ల్ పీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టెక్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ホーム
/
technology
/
ఏఐ విప్లవంతో స్మార్ట్‌ఫోన్లలో యాప్స్ కనిపించవు : నథింగ్ సీఈఓ కార్ల్ పీ జోస్యం
الخميس، 19 مارس 2026
Apps Will Disappear from Smartphones Amidst the AI Revolution keypad phones faded into obscurity following the arrival of the iPhone Nothing CEO Carl Pei Predicts technology
ليست هناك تعليقات:
إرسال تعليق