తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్‌పల్లి రోడ్డులో ఉన్న రిషిత ఆటోమొబైల్స్ గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ప్రమాదం కారణంగా గోదాంలో నిల్వ ఉంచిన హీరో హోండా కంపెనీకి సంబంధించిన స్పేర్‌పార్ట్స్ దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే స్పేర్ పార్ట్స్ దగ్ధమవడంతో దాదాపు రూ.2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.
ఆటోమొబైల్స్ గోదాంలో షార్ట్‌సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం : రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం!
الأحد، 1 مارس 2026
Chevella Fire breaks out in automobile godown due to short circuit Property loss worth Rs. 2 crore Rangareddy district Rishita Automobiles godown on Shankarpally Road telangana
ليست هناك تعليقات:
إرسال تعليق