హైదరాబాద్ లోని గాంధీభవన్ లో తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్‌దేనని మరోసారి రుజువైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమష్టి విజయమన్నారు. ప్రతిపక్షాల విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రజలు ఇదే తీర్పును ఇవ్వబోతున్నారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక మున్సిపల్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని తెలిపారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 స్థానాలకు 16 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
ఎన్నికలు ఏవైనా విజయం కాంగ్రెస్‌దేనని మరోసారి రుజువైంది !
الجمعة، 13 فبراير 2026
It has been proven once again that the victory in any election is for the Congress Minister Jupally Krishna Rao speaking to the media at Gandhi Bhavan in Hyderabad telangana
ليست هناك تعليقات:
إرسال تعليق