తమిళనాడులో త్వరగా జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి ఫుల్ మెజారిటీ సాధిస్తామని, ఏ కూటమిలోనూ చేరబోమని సేలం సభలో టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. అలాగే కొందరు ఓటుకు రూ.5 వేల వరకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆ డబ్బు ప్రజలదే అని దాన్ని తీసుకొని వారి చెవుల్లో విజిల్ వేసి వెళ్లగొట్టాలన్నారు.సేలంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలోని టీవీకే పార్టీనే ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డీఎంకే ప్రభుత్వం పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపించారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విజయ్ మండిపడ్డారు. డీజీపీ నియామకం కూడా సరిగా చేయలేని పరిస్థితి ఉందని విమర్శించారు.ఐదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత ప్రజలను మీ కలలు చెప్పండని అడగడం ఏమిటని డీఎంకేపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సానిటరీ వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సహా అనేక వర్గాలు నిరసనలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం ప్రజావ్యతిరేకమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
ホーム
/
TVK Chief Vijay
/
ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు : టీవీకే చీఫ్ విజయ్
الجمعة، 13 فبراير 2026
Chief Minister Stalin is misleading people He also alleged that some people are ready to give up to Rs. 5 thousand per vote Tamil Nadu TVK Chief Vijay
ليست هناك تعليقات:
إرسال تعليق