న్యూఢిల్లీలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు.ఈ ఘటన ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. లారెన్స్ బిష్ణోయ్ తరపున కోర్టు కేసులను వాదించే న్యాయవాదుల బృందం వాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా లీగల్ టీమ్ వాహనంపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది గ్యాంగ్ వార్‌లో భాగమా లేక లాయర్లను భయపెట్టడానికి చేసిన ప్రయత్నమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ లీగల్ టీమ్‌పై కాల్పులు
الأربعاء، 25 فبراير 2026
crime incident took place in Delhi's Rohini area Lawrence Bishnoi's Legal Team Fired national New Delhi no one was injured in the incident
ليست هناك تعليقات:
إرسال تعليق