తెలంగాణలోని నాగర్ కర్నూల్ లో కుమ్మెర బాధితుల పక్షాన చేపట్టిన దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజులలో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తామని , అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల కొనసాగుతున్న వివక్ష, దాడులు, దౌర్జన్యాలు, ఆలయాల్లో ప్రవేశంపై ఆంక్షలు కొనసాగడం బాధాకరమని అన్నారు.దేవుడిని దర్శించుకునే అర్హత బలహీన వర్గాలకు లేదా ? అని ప్రశ్నించారు. కుమ్మెర దోషులను రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి !
الخميس، 26 فبراير 2026
Former Minister Srinivas Yadav Immediate action should be taken against those responsible for the death of a child protest camp organized in Nagarkurnool telangana
ليست هناك تعليقات:
إرسال تعليق