అదుపు తప్పి రోడ్డుపై జారిన బైక్‌ : బస్సు డ్రైవర్‌ బ్రేకులు వేయడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్న విద్యార్థి

الأحد، 8 فبراير 2026

A bike skidded out of control onto the road kerala Malappuram district student narrowly escaped death as the bus driver applied the brakes. video clip has gone viral on social media

t f B! P L


కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక విద్యార్థి నడిపిన బైక్‌ అదుపు తప్పింది. మలుపులో అది జారిపడింది. దీంతో బైక్‌పై ఉన్న యువకుడు రోడ్డుపై పడ్డాడు. ఎదురుగా వస్తున్న బస్సు టైర్‌ కింద పడబోయాడు. అయితే డ్రైవర్‌ బ్రేకులు వేయడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆదివారం ఒక విద్యార్థి బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డు మలుపులో నియంత్రణ కోల్పోయాడు. దీంతో బైక్‌ జారడంతో ఆ విద్యార్థి రోడ్డుపై పడ్డాడు. కాగా, ఎదురుగా ఒక బస్సు వస్తున్నది. రోడ్డుపై ఉన్న విద్యార్థి దాని వెనుక చక్రం ముందు పడబోయాడు. అయితే డ్రైవర్‌ వెంటనే అప్రమత్తమయ్యాడు. బ్రేకులు వేయడంతో ఆ బస్సు ఆగింది. అయితే బస్సు వెనుక టైర్‌ ముందు తల ఉన్న ఆ విద్యార్థి తృటిలో మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. మరోవైపు గమనించిన స్థానికులు వెంటనే ఆ యువకుడి వద్దకు వచ్చి సహాయం చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆ విద్యార్థి మృత్యుంజయుడని నెటిజన్లు కొనియాడారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ