తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వసంత అనే విద్యార్థిని క్యాంపస్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.మృతురాలి స్వస్థలం వనపర్తి జిల్లాగా గుర్తించారు. ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.వసంత ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందా? లేక ఇతర ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థిని
الأربعاء، 25 فبراير 2026
crime deceased's hometown was identified as Wanaparthy district Engineering student commits suicide in Basara Triple IT Nirmal district telangana
ليست هناك تعليقات:
إرسال تعليق