ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభణ : కోడిగుడ్లు, కోళ్ళు విక్రయాలపై నిషేధం

الثلاثاء، 10 فبراير 2026

Andhra Pradesh Ban on sale of chicken eggs and chickens Bird flu outbreak in the united Chittoor district Control room has also been set up in the collector's office.

t f B! P L


ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్న క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సదుం మండలాలలో ఇప్పటికే నిర్ధారణ అయిన ఈ బర్డ్ ఫ్లూ, కార్వేటి నగరంలో కూడా కలకలం రేపుతుంది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రత్యేక రాపిడ్ యాక్షన్ టీంను రంగంలోకి దింపింది. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. కలెక్టర్ సమిత్ కుమార్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేయగా అధికారులు సామూహిక మరణాల పైన ప్రాథమిక విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో కోడిగుడ్లను, కోళ్లను ఎవరికి అమ్మకూడదని, ఆ ప్రాంతంలో కోళ్లు, కోడిగుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు. నిన్న ఒక్కరోజే ఆర్కేవి పేట, ఇందిరా కాలనీలో కోళ్లఫారాలలో వెయ్యికి పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో ఫారం యజమానులు అధికారులకు తెలియజేశారు. చనిపోయిన కోళ్ళను అధికార యంత్రాంగం జాగ్రత్తగా పూడ్చి పెడుతోంది. చనిపోయిన కోళ్లకు సంబంధించి రక్త నమూనాలను భోపాల్ లోని ల్యాబ్ కు పంపారు. ఈ క్రమంలోనే కారణాలు తెలిసే వరకు కోడిగుడ్లను, కోళ్లను విక్రయించరాదని ఫారం యజమానులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఎక్కడైతే కోళ్లు భారీ సంఖ్యలో మృతి చెందాయో అక్కడకు ఇతరులను అనుమతించవద్దని, వాహనాలను రానివ్వకూడదు అని యజమానులకు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నివారణలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్ ల నిర్వాహకులు బయో సెక్యూరిటీ నిబంధనలను విధిగా పాటించాలని అధికారులు ఆదేశించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ