మా అమ్మకు పెళ్లి చేయాలని ఉంది : హీరోయిన్ సుప్రీత

الأحد، 8 فبراير 2026

Actress Supreetha Andhra Pradesh cinema I want to get my mother married again Supreetha is making her debut as a heroine with the movie 'Amaravathi ki Ahvanam' Surekha Vani telangana

t f B! P L


సురేఖా వాణి 'బొమ్మరిల్లు' మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇవ్వగా ఆమె కుమార్తె సుప్రీత 'అమరావతికి ఆహ్వానం' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తన తల్లి పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అమ్మ సురేఖా వాణికి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని హీరోయిన్ సుప్రీత తెలిపారు. 'రీసెంట్ గానే ఈ మాట మా అమ్మతో చెప్పాను. కానీ ఆమె మా నాన్నతోనే ఆగిపోవాలని ఉంది. ఆ ప్లేస్లోకి వేరే ఎవరినీ రానివ్వకూడదని అనుకుంటుంది. నాకు అదే ఆన్సర్ చెప్పింది. అయితే, నేను పెళ్లి చేసుకునే ముందయినా ఆమెకు పెళ్లి చేయాలనే ఆలోచన ఉంది. మా అమ్మ వాళ్ల మామయ్యకు కూడా ఇదే విషయం చెప్పాను. వాళ్లు కూడా ఓకే అని అన్నారు. కానీ మంచి అబ్బాయి దొరకాలి. ఆమె ఓకే అనాలి. వచ్చే అతను మా అమ్మను బాగా చూసుకోవాలి. ఆమె చాలా హ్యాపీగా ఉండాలి. ఆమె ఏం కోరుకున్నా ఇవ్వాలి. కాలు కూడా కింద పెట్టనివ్వకూడదు. మా అమ్మను ప్రశ్నించకూడదు. ఆమె స్పేస్ ఆమెకు ఇవ్వాలి.' అని తెలిపారు. ఒకప్పుడు అమ్మ సినిమాల్లో చాలా బిజీ ఆర్టిస్ట్ అని, కానీ ప్రస్తుతం మేకప్ వేసుకుని దాదాపు ఏడాదిన్నర దాటిపోయిందని అన్నారు. 'సినిమాలకు చాలా గ్యాప్ వచ్చిందని మా అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు మా అమ్మ చాలా బిజీ ఆర్టిస్ట్. ఎందుకో చాలా మంది సీనియర్లకు అవకాశాలు తగ్గిపోయాయి. అమ్మకు సినిమాలు చేయాలని ఉన్నా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఏదో ఒక సినిమా అయినా చేయాలని ఉందంటూ నాకు చెప్పింది.' అని అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ