ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం ఈ రోజు ఉదయం జరిగింది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి కి చెందిన ఎంపీలందరూ హాజరయ్యారు. ఈ నెల 1న కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, అమెరికాతో కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందం ద్వారా 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులపై సుంకాల తగ్గింపును సాధించినందుకు గానూ ప్రధాని మోడీని ఎన్డీఏ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ మొదటి సారి పాల్గొనడం విశేషం. ఆయనకు ప్రధాని, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ ఎంపీలకు కీలక దిశానిర్దేశం చేశారు. కేంద్ర బడ్జెట్ లోని ప్రజాకర్షక అంశాలను, ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తున్నాయో వివరించాలని కోరారు. ముఖ్యంగా అమెరికా సుంకాల తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు, వ్యాపార వర్గాలకు అర్థమయ్యేలా వివరించాలని ఎంపీలను పీఎం ఆదేశించారు. అలాగే ఉభయ సభల్లో విపక్షాలు చేస్తున్న ఆరోపణల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధాని హెచ్చరించినట్లు తెలుస్తుంది. పార్లమెంట్ లోపల విపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని, ప్రభుత్వ విధానాలను గట్టిగా సమర్థించుకోవాలని ఎన్డీఏ ఎంపీలకు సూచించారు. దేశ ప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాలపై విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది. పార్లమెంటరీ సమావేశాల వేళ ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశం కూటమిలోని ఐక్యతను చాటడమే కాకుండా, రాబోయే రోజుల్లో సభలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసింది.
ホーム
/
Union Ministers
/
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం
الثلاثاء، 3 فبراير 2026
and all MPs belonging to the NDA alliance attended Minister Narendra Modi national NDA Parliamentary Party Meeting Union Ministers
ليست هناك تعليقات:
إرسال تعليق