ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో దూసుకుపోతున్న టీవీఎస్ మోటార్

الخميس، 12 فبراير 2026

558 units of sales automobile electric scooter January 2026 figures TVS has achieved a total of 34 TVS Motor is storming the electric two-wheeler market

t f B! P L


దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. జనవరి 2026 గణాంకాల ప్రకారం టీవీఎస్ ఏకంగా 34,558 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇది గతేడాదితో పోలిస్తే 44 శాతం వృద్ధి. తన సమీప ప్రత్యర్థి బజాజ్ ఆటో కంటే సుమారు 9,000 యూనిట్ల ఆధిక్యంలో ఉండి మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. టీవీఎస్ ఐక్యూబ్ మోడల్‌పై కస్టమర్లు చూపిస్తున్న నమ్మకమే ఈ విజయానికి కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు ఈవీ మార్కెట్‌లో మూడో వంతు వాటాను కలిగి ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జనవరిలో ఓలా అమ్మకాలు ఏకంగా 69 శాతం పడిపోయి కేవలం 7,516 యూనిట్ల వద్ద ఆగిపోయాయి. దీంతో ఓలా ఐదో స్థానానికి పడిపోయింది. సర్వీస్ ఇబ్బందులు, నాణ్యత సమస్యలే ఓలా పతనానికి కారణమని తెలుస్తోంది. మరోవైపు ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ తమ కొత్త స్ట్రాటజీలతో విక్రయాలను పెంచుకుంటూ రేసులో ముందుకు వస్తున్నాయి. ప్రస్తుత ఈవీ మార్కెట్ ట్రెండ్ గమనిస్తే కస్టమర్లు కేవలం స్టైల్ చూసి కాకుండా, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ ఉన్న కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారు. టీవీఎస్, బజాజ్, హీరో వంటి పాత కంపెనీలకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లు, మెకానిక్ సదుపాయం వీరికి ప్లస్ పాయింట్‌గా మారింది. కొత్తగా వచ్చిన స్టార్టప్ కంపెనీలు మార్కెటింగ్ బాగా చేసినా, గ్రౌండ్ లెవల్ సర్వీస్ అందించడంలో వెనుకబడ్డాయి. అందుకే కస్టమర్ల ఓటు ఇప్పుడు పాత దిగ్గజాలకే పడుతోంది. జనవరిలో మొత్తం 1,22,812 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది కంటే 25 శాతం ఎక్కువ. భారత టూ-వీలర్ మార్కెట్‌లో ఈవీల వాటా ఇప్పుడు 6.6 శాతానికి చేరుకుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ