తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో కారు, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతి చెందగా, ఆయన భార్య తీవ్ర గాయాలపాలైంది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కొండపాక గ్రామ శివారులోని మెదక్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు మరమ్మతులు జరుగుతుండటంతో ఆ ప్రాంతంలో వన్‌వే అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన అబ్దుల్ రఫీ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య మజ్దూర్ బేగం తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్ రఫీ సింగరేణి ఉద్యోగిగా పని చేస్తున్నట్లు తెలిసింది. భార్యభర్తలు హైదరాబాద్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరుక్కుపోయిన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కారు డీసీఎం వ్యాన్ ఢీ : భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
السبت، 28 فبراير 2026
Car collides with DCM van crime due to road repairs being carried out at Medak Engineering College Husband dies Kondapaka mandal Siddipet district telangana wife seriously injured
ليست هناك تعليقات:
إرسال تعليق