అనుపమ్ మిట్టల్‌ను మరో రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దు : సుప్రీంకోర్టు ఆదేశం

الثلاثاء، 3 فبراير 2026

fraud case related to the matrimonial platform national Supreme Court orders no arrest of Anupam Mittal for another two weeks telangana

t f B! P L


షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్‌ను మరో రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాట్రిమోనియల్ ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా జరిగిన ఫ్రాడ్ కేసులో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఈ కేసులో అనుపమ్ మిట్టల్‌తో పాటు మరో ఇద్దరికి కూడా రక్షణ కల్పిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనపెట్టింది. అయితే ఈ కేసును మళ్లీ హైకోర్టుకు పంపించింది. తాత్కాలిక బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలని మిట్టల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ షాదీ డాట్ కామ్ పై కేసు నమోదు చేసింది. షాదీ డాట్‌కామ్ ద్వారా ఫేక్ ప్రొఫైల్‌ను సృష్టించిన ఓ వ్యక్తి తనను 11 లక్షలు మోసం చేసినట్లు ఆ మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది. యూజర్ సమాచారాన్ని షాదీ డాట్ కామ్ సరైన రీతిలో వెరిఫై చేయలేదని ఆ మహిళ పేర్కొన్నది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ