అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుండటంతో బిల్‌గేట్స్ మరోసారి తన గతాన్ని తలుచుకుని విచారం వ్యక్తం చేశారు. ఆ వివాదాస్పద వ్యక్తితో తాను గడిపిన ప్రతి నిమిషం పట్ల పశ్చాత్తాపం చెందుతున్నానని, బహిరంగంగానే అందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఆయన ప్రకటించారు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన లక్షలాది ఇమెయిల్స్, పత్రాలలో బిల్ గేట్స్ పేరు కూడా బయటకు వచ్చింది. ముఖ్యంగా జెఫ్రీ ఎప్‌స్టీన్ రాసిన కొన్ని డ్రాఫ్ట్ ఇమెయిల్స్‌లో.. బిల్‌గేట్స్ వివాహేతర సంబంధాల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన రష్యన్ యువతులతో గడిపేందుకు తాను సహకరించానని, వివాహిత మహిళలతో రహస్యంగా భేటీ అయ్యేలా ఏర్పాట్లు కూడా చేశానని అందులో చెప్పుకొచ్చారు. అలాగే ఈ రహస్యాలు బయట పడకుండా ఉండేందుకు తన భార్య (మిలిండా గేట్స్)కు యాంటీ బయాటిక్స్‌ను కూడా అడిగారని తెలిపారు. అయితే ఈ పరిణామాల తర్వాత తనతో ఉన్న ఆరేళ్ల స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నాడని కూడా వివరించారు. అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. "ఆ ఇమెయిల్ ఎప్పుడూ ఎవరికీ పంపలేదు. అందులోని అంశాలన్నీ పచ్చి అబద్ధాలు. నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికే ఎప్‌స్టీన్ ఇలాంటివి రాసి ఉండవచ్చు" అని గేట్స్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ホーム
/
technology
/
జెఫ్రీ ఎప్‌స్టీన్ తో గడిపిన ప్రతి నిమిషం పట్ల పశ్చాత్తాపం చెందుతున్నా : బిల్‌గేట్స్
الخميس، 5 فبراير 2026
Bill Gates Bill Gates' name also came up in the millions of emails and documents released by the US Department of Justice international Regrets every minute spent with Jeffrey Epstein technology
ليست هناك تعليقات:
إرسال تعليق