న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఇండియా AI సమ్మిట్‌లో భారత్ మండపం వద్ద ఉన్న కౌంటర్ లో ఉచితంగా అందిస్తున్న క్యాలెండర్ల కోసం ఒకరినొకరు తోసుకున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను ఎక్స్ యూజర్ డాక్టర్ రంజన్ షేర్ చేయడంతో చర్చకు తెరలేచింది. హై-ప్రొఫైల్ టెక్ ఈవెంట్‌లో కనీస మర్యాద పాటించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు ఫ్రీగా వచ్చేదాన్ని తీసుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి అంటూ కమెంట్ చేశారు. క్యాలెండర్‌లో ఉపయోగకరమైన సమాచారం ఉండి ఉండవచ్చు,అలాంటి బహుమతులు కంపెనీలకు బ్రాండింగ్‌గా కూడా పనిచేస్తాయి కదా అన్నారు. మరోవైపు వీడియోలో కనిపించే వారిలో చాలామంది నిజమైన AI నిపుణులు లేదా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నవారు కాకపోవచ్చు అని కమెంట్ చేయడం గమనార్హం.
ఇండియా AI సమ్మిట్‌లో ఉచిత క్యాలెండర్ల కోసం ఎగబడిన జనం : వీడియో వైరల్
الجمعة، 20 فبراير 2026
People jostling for free calendars at India AI Summit science sparked a debate technology Video goes viral video was shared by ex-user Dr. Ranjan
ليست هناك تعليقات:
إرسال تعليق