ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో తల్లిదండ్రులు ఫోన్లు లాగేసుకోవడంతో మనస్తాపం చెంది ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురూ మైనర్లే కావడం మరింత షాక్ కి గురి చేసే అంశం. వారు భవనం 9వ అంతస్తులోని బాల్కనీ నుంచి దూకి వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. ముగ్గురూ కొరియన్ కల్చర్‌కు బానిసలుగా మారారు. వారు చదువు కూడా మానేసి అదే పనిగా పెట్టుకున్నారు. ఏకంగా తమ పేర్లను కూడా మార్చేసుకున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు వారిని మందలించారో, వారి నుంచి ఫోన్లు లాగేసుకున్నారో.. అంతే పిల్లలు మనస్తాపానికి గురయ్యారు. తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురూ ఒకేసారి బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. 'అమ్మా నాన్న సారీ' అని అందులో రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకేశారని చెప్పారు. 'కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు' అని పిల్లలు తరచూ అనేవారని కుటుంబసభ్యులు తెలిపారు. ”క్షమించండి, నాన్నా. మేము చాలా చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాం” ముగ్గురు సోదరీమణుల చివరి మాటలు ఇవి.
ホーム
/
Uttar Pradesh
/
9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు !
الأربعاء، 4 فبراير 2026
causing them distress Ghaziabad national parents took away their phones Three sisters commit suicide by jumping from the 9th floor Uttar Pradesh
ليست هناك تعليقات:
إرسال تعليق