హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ నుంచి మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్‌సీ, కేఆర్‌ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని హరీష్ స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని, ఈఎన్‌సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్ నిర్లక్ష్యంగా ఉందని హరీష్ మండిపడ్డారు.
80 శాతం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంది : అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు
الثلاثاء، 10 فبراير 2026
Andhra Pradesh has used 80 percent of Krishna water Former Minister Harish Rao telangana Why is the Apex Council meeting not being held
ليست هناك تعليقات:
إرسال تعليق