దేశీయ మార్కెట్లోకి షియోమీ తక్కువ ధరతో ఒక స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. తమ బ్రాండ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన వాటిలో అతిపెద్దదైన షియోమీ క్యూఎల్ఈడీ టీవీ ఎక్స్ ప్రో 75 మోడల్‌ను అఫీషియల్‌గా పరిచయం చేసింది. ఫిబ్రవరి 27 నుంచే దీని సేల్స్ మొదలు కానున్నాయి. 75-అంగుళాల భారీ డిస్‌ప్లే, 4K అల్ట్రా HD (3840 x 2160 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ టీవీని రూ.69,999 బడ్జెట్ ధరకే మార్కెట్లోకి తీసుకురావడం విశేషం. లాంచ్ ఆఫర్ కింద రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో దీన్ని కేవలం రూ.64,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ముందుగా ప్రీ-బుక్ చేసుకున్న వారికి రూ.10,999 విలువైన నాలుగేళ్ల కాంప్రహెన్సివ్ వారంటీని ఫ్రీగా ఇస్తున్నారు. మామూలు LED ప్యానెల్స్‌తో పోలిస్తే ఇందులో వాడిన QLED టెక్నాలజీ వల్ల రంగులు చాలా డీప్‌గా, బ్రైట్‌గా కనిపిస్తాయి. దీనికి తోడు డాల్బీ విజన్, HDR10+ సపోర్ట్ ఉండటంతో డార్క్ సీన్స్ కూడా చాలా క్లియర్‌గా ఉంటాయి. టీవీ ముందు భాగంలో ఏకంగా 97.76 శాతం స్క్రీనే ఉండటంతో బెజెల్-లెస్ లుక్ అదిరిపోతుంది. స్పోర్ట్స్, యాక్షన్ సినిమాలు చూసేటప్పుడు బ్లర్ లేకుండా స్మూత్‌గా కనిపించేందుకు DLG 120Hz, MEMC టెక్నాలజీలను వాడారు. డైరెక్టర్ ఎలాగైతే సినిమాను చూపించాలనుకున్నాడో.. అచ్చం అలాగే చూసేందుకు ఇందులో 'ఫిల్మ్‌మేకర్ మోడ్' కూడా ఉంది. అంతేకాదు, గేమర్స్ కోసం లాగ్ తగ్గించడానికి ఆటో లో లాటెన్సీ మోడ్ కూడా ఇచ్చారు. దీనిలో 34 వాట్స్ పవర్ ఇచ్చే రెండు బాక్స్ స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ ఆడియో, DTS X, DTS Virtual: X లాంటి లేటెస్ట్ ఆడియో టెక్నాలజీల సపోర్ట్ ఉండటంతో మంచి వర్చువల్ సరౌండ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. మనం చూస్తున్న కంటెంట్‌ను బట్టి డైలాగ్స్, బాస్ దానంతటదే అడ్జస్ట్ అయ్యేలా 'షియోమీ సౌండ్ ట్యూనింగ్' ఫీచర్ చేర్చారు. అలాగే, ఇందులో ఉన్న eARC (HDMI) పోర్ట్ ద్వారా.. ఎలాంటి క్వాలిటీ డ్రాప్ లేకుండా డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సౌండ్‌ను నేరుగా మీ సౌండ్‌బార్ లేదా హోమ్ థియేటర్‌కు పాస్ చేసుకోవచ్చు. షియోమీ సొంత ఇంటర్‌ఫేస్ అయిన ప్యాచ్‌వాల్ తో ఈ టీవీ రన్ అవుతుంది. రకరకాల OTT యాప్స్‌లోని కంటెంట్‌ను ఇది ఒకే దగ్గర నీట్‌గా చూపిస్తుంది. ఫ్రీగా లైవ్ ఛానెల్స్ చూసుకునేందుకు 'షియోమీ TV+' సర్వీస్ కూడా ఉంది. యూనివర్సల్ సెర్చ్ ద్వారా ఏ కంటెంట్ అయినా ఈజీగా వెతుక్కోవచ్చు. పిల్లలు అనవసరమైన కంటెంట్ చూడకుండా లాక్ వేసేందుకు కిడ్స్ మోడ్, మనకు నచ్చిన భాషలో వాడుకునేందుకు లాంగ్వేజ్ యూనివర్స్ ఫీచర్లు ఇచ్చారు. ఇందులో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది, కాబట్టి వాయిస్ కమాండ్స్‌తో టీవీని కంట్రోల్ చేయొచ్చు. మొబైల్ నుంచి TVకి వీడియోలు కాస్ట్ చేయడానికి యాపిల్ ఎయిర్‌ప్లే 2, గూగుల్ కాస్ట్, మిరాకాస్ట్ సపోర్ట్ కూడా ఉంది. దీనిలో X Pro 75 TVలో క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ వాడారు. యాప్స్, డేటా స్టోర్ చేసుకోవడానికి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. కనెక్టివిటీ పరంగా.. మూడు HDMI పోర్ట్స్, రెండు USB 2.0 పోర్ట్స్, ఇథర్‌నెట్, AV ఇన్‌పుట్, ఆప్టికల్ ఔట్‌పుట్, ఆంటెన్నా ఇన్, సెపరేట్ ఇయర్‌ఫోన్ జాక్ లాంటివి అన్నీ ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్షన్ల కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ కూడా ఇచ్చారు.
0 Comments