Ad Code

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య !


తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాల్‌రెడ్డి (50) పని ముగించుకుని బైకుపై తెల్లాపూర్‌లోని తన నివాసానికి వెళ్తుండగా గ్రామ శివారులో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో దుబ్బాక ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Post a Comment

0 Comments

Close Menu