గ్లోబల్ మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్ ఫోన్స్ ను నోట్ 60, నోట్ 60 ప్రోని విడుదల చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ప్రధాన ఆకర్షణ వీటి డిస్ప్లేలు. ఇవి 6.78 అంగుళాల 1.5K (1208×2644 పిక్సెల్స్) 3D కర్వ్డ్ LTPS AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఇవి 144Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తాయి. దీనితో ఇవి ఎండలో కూడా స్పష్టమైన విజువల్స్ అందిస్తాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు. ఇన్ఫినిక్స్ నోట్ 60 సిరీస్‌లో పెర్ఫార్మెన్స్ విషయంలో అసలు రాజీ పడలేదు. నోట్ 60 ప్రోలో తొలిసారిగా స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 చిప్‌సెట్‌ను వాడారు. ఇది గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కోసం అత్యుత్తమ వేగాన్ని అందిస్తుంది. అలాగే నోట్ 60లో సాధారణ మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే వీటిలో గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండటానికి 4758mm² 3D VC కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ల మరో ప్రత్యేకత వీటి బ్యాటరీ సామర్థ్యం. ఇన్ఫినిక్స్ చరిత్రలోనే అతిపెద్దదైన 6500mAh బ్యాటరీని ఈ ఫోన్లలో అందించారు. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ కేవలం 7.36mm మందంతో చాలా స్లిమ్‌గా ఉంటుంది. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ప్రో మోడల్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయగా, సాధారణ మోడల్ 45W ఛార్జింగ్‌తో వస్తుంది. ఇవి రెండూ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తాయి. దాదాపు 2,000 సార్లు ఛార్జ్ చేసినా బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తగ్గదని కంపెనీ పేర్కొంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా (OIS సపోర్ట్‌తో), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 పై నడుస్తాయి. వీటికి 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు లభిస్తాయి. ఫోన్ కి ఒకవైపున ఉండే ఈ బటన్ ద్వారా హృదయ స్పందన రేటు (Heart Rate), ఆక్సిజన్ లెవల్స్ (SpO2) వంటి ఆరోగ్య వివరాలను తెలుసుకోవచ్చు. నోట్ 60 ప్రో వెనుక భాగంలో ఒక డిస్ప్లే ఉంటుంది. ఇది నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే వెలుగుతుంది. డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్: IP64 రేటింగ్‌తో ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ లభిస్తుంది. మెరుగైన ఆడియో అనుభవం కోసం జెబిఎల్ ట్యూన్ చేసిన స్టీరియో స్పీకర్లను అమర్చారు. నోట్ 60 ప్రో మోడల్ డీప్ ఓషన్ బ్లూ, సోలార్ ఆరెంజ్ వంటి ఆరు రంగుల్లో లభిస్తుండగా.., నోట్ 60 మోడల్ రోజ్ గోల్డ్, ఫిజ్ బ్లూ వంటి ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి రానుంది.
ఇన్ఫినిక్స్ నోట్ 60, నోట్ 60 ప్రో స్మార్ట్ ఫోన్లు విడుదల
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق