హారాష్ట్రలోని మల్కాపూర్ పరిధిలో గల ఆగాశివ్‌నగర్ శ్రీరామ్ కాలనీ నుంచి  తెల్లవారుజామున 03:31 గంటలకు 'డయల్ 112'కు ఒక మహిళ నుండి కాల్ వచ్చింది. "హలో, నాకు సహాయం కావాలి.. త్వరగా రండి" అని ఆమె కోరింది. పోలీసులు వెళ్లేసరికి ఆ మహిళ చేతిలో గొడ్డలి ఉంది. ఆమె ఎదురుగా రాజేంద్ర మరియప్ప కాలే అనే వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. నిందితురాలు సారిక కోలి పోలీసుల ప్రాథమిక విచారణలో తన నేరాన్ని అంగీకరించింది. రాజేంద్రతో తనకు గతంలో ప్రేమ సంబంధం ఉందని, అయితే అతను తనపై పదేపదే అనుమానం పెంచుకుని గొడవ పడుతుండేవాడని తెలిపింది. ఘటన జరిగిన రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున అతను మళ్ళీ దాడి చేయడంతో, కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో అతని ముఖం, మెడపై నరికి చంపినట్లు ఆమె ఒప్పుకుంది. 

Post a Comment

أحدث أقدم