దేశీయ మార్కెట్లో విడుదలైన మోటో జీ57 పవర్ 5జీ ₹15,000 లోపు ధరలో లభించే అత్యుత్తమ ఫోన్లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ఫోన్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్ , స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ భద్రత కోసం Corning Gorilla Glass 7i ని ఉపయోగించారు. ప్రీమియం వేగాన్ లెదర్ ఫినిషింగ్‌తో లభించే ఈ ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లగ్జరీగా అనిపిస్తుంది. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon 6s Gen 4 (4nm) ప్రాసెసర్‌ను వాడింది. ఈ చిప్‌సెట్‌తో వస్తున్న ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. ఇది 4nm టెక్నాలజీపై ఆధారపడి ఉండటం వల్ల పవర్ తక్కువగా తీసుకుంటూ ఎక్కువ వేగంతో పనిచేస్తుంది. 8GB LPDDR4X RAM (RAM Boost ద్వారా 24GB వరకు పెంచుకోవచ్చు). 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ పేరుకు తగ్గట్టుగానే 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ లైఫ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో 2 నుండి 3 రోజుల వరకు బ్యాటరీ వస్తుంది. 33W టర్బో ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, దీనివల్ల ఇంత పెద్ద బ్యాటరీ కూడా త్వరగానే ఛార్జ్ అవుతుంది. 50MP సోనీ LYT-600 సెన్సార్. ఇది తక్కువ కాంతిలో కూడా నాణ్యమైన ఫోటోలు ఇస్తుంది. 8MP అల్ట్రావైడ్ లెన్స్ (119.5 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ).ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు. ఈ ఫోన్ సరికొత్త Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవం లభిస్తుంది. IP64 రేటింగ్‌తో దుమ్ము , నీటి చినుకుల నుండి రక్షణ ఉంటుంది. అలాగే MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ కూడా దీని సొంతం. అసలు ధర ₹17,999 (8GB + 128GB వేరియంట్). ప్రస్తుతం అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్ ఆఫర్లు , బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి ₹12,999 – ₹14,118 మధ్య లభిస్తోంది. పాంటోన్ రెగట్టా, పాంటోన్ కోర్సెయిర్, పాంటోన్ ఫ్లూయిడిటీ రంగుల్లో అందుబాటులో ఉంది.
0 Comments