నైజీరియాలోని ప్లాటూ రాష్ట్రం, వాసే లోకల్ గవర్నమెంట్ పరిధిలోని కంపానీ జురాక్ అనే గ్రామం మైనింగ్ గనిలో విష వాయువు లీక్ కావడంతో 37 మంది కార్మికులు దుర్మరణం పాలైయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక యువకులు ఒక చైనీస్ కంపెనీకి చెందిన మైనింగ్ సైట్లో సీసం, జింక్ తవ్వకాలు జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున కార్మికులు భూగర్భంలోకి లోతుగా వెళ్లిన సమయంలో, అక్కడ పేరుకుపోయిన విషవాయువులు ఒక్కసారిగా వెలువడ్డాయి. గాలి సరిగ్గా ఆడని ఆ ఇరుకైన సొరంగాల్లో కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువులను పీల్చడంతో కార్మికులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది 20 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు గల యువకులే ఉండటం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే సహచర కార్మికులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. స్పృహ కోల్పోయిన వారిని బయటకు తీసి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమాచారం అందుకున్న నైజీరియా సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. విషవాయువు ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గని పరిసరాలను మూసివేశారు. ప్లాటూ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి జోయిస్ రామ్నాప్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, ప్రాథమిక విచారణలో గ్యాస్ పేలుడు లేదా లీకేజీ వల్ల ఈ మరణాలు సంభవించినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ గని నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గని ప్రాంతాన్ని మూసివేసి, పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు.
మైనింగ్ గనిలో విష వాయువు లీక్ కావడంతో 37 మంది కార్మికులు దుర్మరణం
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق