భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నిర్వహించే కీలక ఖనిజాల మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో కీలక ఖనిజాల్లో వ్యూహాత్మక సహకారంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇక పర్యటనలో భాగంగా జైశంకర్.. అమెరికా ప్రభుత్వ ఉన్నతాధికారులతో కూడా సమావేశమవుతారు. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలపై రెండు దేశాల అధికారులు చర్చించారు. అయినా కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయంపై కూడా జైశంకర్ చర్చించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Post a Comment

Previous Post Next Post